అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న సుంకాల యుద్ధం మరింత తీవ్రతరంగా మారింది. అమెరికా కంపెనీ బోయింగ్ నుంచి విమానాలను కొనుగోలు చేయవద్దని తమ ఎయిర్‌లైన్స్ సంస్థలకు చైనా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో డ్రాగన్ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విదేశీ వస్తువులపై భారీగా సుంకాలు విధించడం తెలిసిందే. చైనా దిగుమతులపై 145 శాతం వరకు సుంకాలు వసూలు చేయనున్నట్టు అమెరికా ప్రకటించగా, దీనిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్యలను చట్ట విరుద్ధమైన చర్యలుగా అభివర్ణించిన చైనా, ప్రతీకారంగా అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాన్ని విధించేందుకు సిద్ధమవుతోంది. దీంతో బోయింగ్ విమాన పరికరాలు, విడిభాగాల కొనుగోలును పూర్తిగా నిలిపివేయాలని చైనా ప్రభుత్వ ఆదేశాలిచ్చింది. సుంకాల పెరుగుదల వల్ల విమాన పరికరాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని చైనా భావిస్తోంది. ఈ పరిణామాలతో అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ఉధృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు