అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది.ఒకరిపై ఒకరు ప్రతీకార సుంకాలు విధించుకుంటూ దాడికి దిగుతున్న వేళ,ఆసక్తికర సంఘటన ఒకటి చర్చనీయాంశమైంది.ఇటీవల అమెరికా అధ్యక్షుడి సహాయకురాలు,వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఓ మీడియా సమావేశానికి చైనాలో తయారైన రెడ్ డ్రెస్ ధరించి హాజరయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన చైనా దౌత్యవేత్త ఝాన్ ఝీషింగ్,ఆ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ,‘బిజినెస్ విషయంలో చైనాను నిందిస్తారు..జీవితంలో మాత్రం చైనాలో తయారైనవి కొనుగోలు చేస్తారు’ అంటూ విమర్శించారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.‘చైనా ఫ్యాక్టరీలో తయారైన అందమైన డ్రెస్ ధరించి..చైనాను నిందిస్తున్నారు’, ‘చైనాను నిందించడం ఆమె పని.. చైనా దుస్తులను ఆస్వాదించడం ఆమె జీవితం’ అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
చైనా దుస్తుల్లో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్… డ్రాగన్ వ్యంగ్యాస్త్రాలు!
By admin1 Min Read
Previous Articleఅధిక రక్తపోటు తగ్గాలంటే…ఈ పండు రోజుకొక్కటి తింటే చాలు….!
Next Article బంగ్లాదేశ్ లో భారత్ పర్యటన… 3వన్డేలు, 3టీ 20లు