ప్రయాణాలలో ఉన్న వారికి కూడా సేవలు అందుబాటులో ఉండేలా ముంబయి నుండి మన్మాడ్ వెళ్లే పంచవటి ఎక్స్‌ప్రెస్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన ఏటీఎంను ఏర్పాటు చేసింది. భారతీయ రైల్వే చరిత్రలో రైలులో ఏటీఎం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. దీనికి ప్రత్యేకమైన షటర్‌ను అమర్చారు. ఇప్పటికే దాని ట్రయల్ రన్ విజయవంతమైందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో భారతదేశంలో తొలిసారిగా ఏటీఎం సేవలు కలిగిన ట్రైన్‌గా పంచవటి ఎక్స్‌ప్రెస్ నిలిచింది. దీనిని INFRIS (ఇండియన్ రైల్వేస్ ఇన్నోవేటివ్ అండ్ నాన్-ఫేర్ రెవెన్యూ ఐడియాస్ స్కీమ్)లో భాగంగా ప్రవేశపెట్టారు. భారత రైల్వేల భూసావల్ విభాగం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భాగస్వామ్యంతో ఈ ఉపయోగకరమైన సౌకర్యం సాధ్యమైంది.
ట్రైన్ లో ఏటీఎం… భారతీయ రైల్వే చరిత్రలో మొట్టమొదటి ట్రైన్ గా పంచవటి ఎక్స్ ప్రెస్..!
By admin1 Min Read
Previous Article‘క్వాంటమ్ ఏఐ గ్లోబల్’తో దిల్ రాజు … కీలక ప్రకటన
Next Article నేడూ లాభాల్లో నే దేశీయ స్టాక్ మార్కెట్లు..!