2025 మార్చిలో జరిగిన SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సంవత్సరం మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు . ఉత్తీర్ణత శాతం 81.14%గా నమోదైందని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా అత్యుత్తమంగా 93.90% ఉత్తీర్ణత శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 1,680 పాఠశాలలు 100% ఫలితాలను సాధించాయని మంత్రి వివరించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈసారి విఫలమైనవారు నిరుత్సాహపడకండని సూచించారు. జీవితంలో రెండో అవకాశాలు లభిస్తాయి. అదనపు పరీక్షలు 2025 మే 19 నుండి 28 వరకు జరుగుతాయి. ఇది విజయం సాధించేందుకు మరో అవకాశమని భరోసానిచ్చారు.
ఈ వెబ్సైట్లలో చూడొచ్చు:
bse.ap.gov.in
results.bse.ap.gov.in
WhatsApp (Mana Mitra): Send “Hi” to 95523 00009.
Previous Articleఎయిర్ పోర్ట్ లోనే ప్రధాని మోడీ అత్యవసర భేటీ
Next Article వైసీపీ నుండి దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్