టైటానిక్ దుర్ఘటనలో బయటపడిన సర్వైవర్ కల్నల్ ఆర్చిబాల్డ్ గ్రేసీ.. టైటానిక్ షిప్ మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు రాసిన లేఖ యూకేలో జరిగిన వేలంలో రికార్డు స్థాయిలో విక్రయించబడడం విశేషం . వైల్ట్ షైర్ లోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ నిర్వహించిన వేలంలో ఆ లేఖకు రికార్డు స్థాయిలో రూ.3.4 కోట్ల ధర పలికింది. 1912 ఏప్రిల్ 15న ప్రమాదవశాత్తు టైటానిక్ షిప్ ఒక ఐస్ బర్గ్ ను ఢీకొని మునిగిపోయిన సంగతి తెలిసిందే. సుమారు 1500 మంది ఈ దుర్ఘటనలో మరణించారు. అయితే ఈ ప్రమాదం నుండి బతికి బయటపడిన అతి తక్కువ మందిలో ఆర్చిబాల్డ్ గ్రేసీ కూడా ఉన్నారు. ఆ ప్రమాదం నుంచి బయటపడినప్పటికీ అతి తక్కువ ఉష్ణోగ్రత కారణంగా, గాయాల వల్ల అనారోగ్యానికి గురై ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో కొద్ది నెలలకే డిసెంబర్ 1912లో గ్రేసీ మరణించారు. ఇక గ్రేసీ తాను రచించిన ‘ది ట్రూత్ ఎబౌట్ ది టైటానిక్’ పుస్తకంలో తాను తప్పించుకున్న విషయాలను వివరించాడు. 1912 ఏప్రిల్ 10న సౌతాంప్టన్ నుంచి గ్రేసీ రాసినట్లు తెలుస్తున్న లేఖకు వేలం నిర్వహించగా, రికార్డు ధర పలికింది.
టైటానిక్ ప్రమాదం నుండి బయటపడ్డ కల్నల్ ఆర్చిబాల్డ్ గ్రేసీ లెటర్ కు వేలంలో భారీ ధర..!
By admin1 Min Read