పహల్గామ్ దాడి తదనంతర పరిణామాలతో పాకిస్థాన్ పౌరులకు జారీ చేసిన వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దాదాపు అన్ని రకాల వీసాలను రద్దు చేసి 72 గంటల్లోగా వారి దేశానికి వెళ్లిపోవాలంటూ గడువు విధించింది. సాధారణ వీసాల గడువు నిన్నటితో ముగియగా మెడికల్ వీసాలపై వచ్చిన వారికి రేపటి వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం విధించిన గడువు తర్వాత కూడా భారత్ లోనే ఉండిపోయిన పాకిస్థానీ పౌరులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉన్న విదేశీయులకు మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక గత మూడు రోజులుగా పంజాబ్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దు గుండా భారీగా ప్రజల తరలింపు జరిగింది. మన దేశానికి చెందిన వారు కూడా తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నారు.
గడువు ముగిసినా వెళ్లకపోతే మూడేళ్ల జైలు, రూ.3 లక్షల ఫైన్… పాక్ పౌరులకు కేంద్రం వార్నింగ్
By admin1 Min Read