జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదదాడి నేపథ్యంలో పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరుతూ ప్రధాని మోడీకి కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే లేఖ రాశారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా రాహుల్ ఈ విషయం తెలిపారు. పహాల్గాం లో జరిగిన ఉగ్రవాదదాడి ప్రతి ఒక్క భారతీయుడిని ఆగ్రహానికి గురి చేసింది. ఈ క్లిష్ట సమయంలో మనమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి ఉంటామని అందరికీ తెలపాలని పార్లమెంటు రెండు సభల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మల్లిఖార్జున్ ఖర్గే కూడా ప్రధానికి లేఖ రాశారు. ఇప్పటికే ప్రతిపక్షాలు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నాయి.
పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలంటూ ప్రధానికి లేఖ రాసిన రాహుల్ గాంధీ
By admin1 Min Read