జమ్మూ & కాశ్మీర్ లో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ, జనసేన పార్టీ మంగళగిరి లోని CK కన్వెన్షన్ లో ధోనీసేన పార్టీ నాయకత్వంతో ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ పాల్గొన్నారు.26 మంది మృతులకు నివాళులు అర్పించారు. అందులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టి మధుసూదన రావు మృతి చెందటం బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ తరపున రూ.50 లక్షలు పరిహారం ప్రకటించారు. ఉగ్రవాద దాడికి దీటైన సమాధానం ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్రం బలంగా చెబుతుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నిరాయుదులపై ఎప్పుడూ ఎవరూ దాడి చెయ్యరు, కానీ పహల్గాం లో పర్యాటకులపై క్రూరంగా దాడి చేసి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది కాశ్మీరీ పండిట్ లను తరిమికొట్టారు, ఊచకోత కోశారు. 1986 సమయంలో షూటింగ్ ల కోసం వెళ్ళినప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండేది, 1989 సమయంలో దాడులు తీవ్రస్థాయికి వెళ్లాయని పేర్కొన్నారు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఎప్పటికీ భారతదేశానిదే, కశ్యప ముని పేరు మీద ఏర్పడిన ప్రాంతం కాశ్మీర్, అమర్ నాథ్ నెలవైన ప్రదేశం, శంకరాచార్య నడిచిన ప్రాంతమని తెలిపారు. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతీ చర్యకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. వారు తీసుకున్న నిర్ణయాలను అందరూ గౌరవించాలని స్పష్టం చేశారు. కొంతమంది నాయకులు ఈ ఉగ్రవాద దాడిని కూడా ఖండించకుండా పాకిస్తాన్ ను ప్రేమిస్తాం, హిందువులపై మతం ఆధారంగా దాడి కాదు అని అంటారు, సత్యాన్ని చెప్పడానికి కూడా మీకు రాజకీయాలా? కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ మాటలు మాట్లాడుతున్నారు, మీరు భారతీయులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. సెక్యులరిజం అంటే కేవలం ముస్లిం లేదా, ఇతర మతాల మీద దాడి జరిగినప్పుడే గుర్తొస్తుందా? హిందువులపై దాడి జరిగినప్పుడు గుర్తుకు రాదా? ఏ మతం పై దాడి జరిగినా సరే మనం ఖండించాలని అన్నారు.
కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం.. ఎప్పటికీ మనదే: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్
By admin2 Mins Read