భారత సాయుధ దళాల సామర్థ్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేసే విధంగా మన దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నేడు ఢిల్లీ లోని ప్రధాని నివాసంలో కీలక సమావేశం జరిగింది. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలోని అంతర్గత భద్రత మరియు సరిహద్దులలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ఉగ్రవాదాన్ని అణిచిపారేయడం జాతీయ సంకల్పమని ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తాము ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో ధృఢనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. పహాల్గాం దాడికి ధీటుగా బదులిస్తామని పునరుద్ఘాటించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు