ఆపరేషన్ సింధూర్ వివరాలను విదేశాంగ సెక్రెటరీ విక్రమ్ మిస్రీ వెల్లడించారు . ఏప్రిల్ 22న పహల్గామ్ లో భారత పర్యటకులపై ఉగ్రదాడి జరిగింది.. ఈ దాడిలో సుమారు 26 మందిని చంపేశారు.. జమ్మూ కశ్మీర్ లో అభివృద్ధిని అడ్డుకునేందుకే ఉగ్రదాడి.. కశ్మీర్ ఆర్థికాభివృద్ధిని అడ్డుకునేందుకు దాడి చేశారని విక్రమ్ మిస్రీ అన్నారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందని తెలిపారు ఈ ఉగ్రదాడి వెనుక లాష్కరే తోయిబా కుట్ర ఉందన్నారు. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఈ దాడి చేసింది. ఈ దాడి చేశామని సోషల్ మీడియాలో టీఆర్ఎఫ్ ప్రకటించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందనే పాకిస్తాన్ పై దౌత్య, వాణిజ్య పరమైన ఆంక్షలు విధించామని పేర్కొన్నారు . చాలా కాలం నుండి పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుందని విదేశాంగ సెక్రెటరీ విక్రమ్ మిస్రీ పునరుద్ఘాటించారు. నియంత్రణ రేఖ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముజఫరాబాద్ లోని ఎల్ఈటీ క్యాంపుపై మొదటి దాడి చేశాం. ఎల్ఓసీలోని బింబల్ క్యాంపులో దాడి చేశాం. ఇక్కడే లాష్కరే తోయిబా ఉగ్రవాడులకు ట్రైనింగ్ జరుగుతుంది. పాకిస్తాన్ లోని సర్జల్ క్యాంపుపై దాడి చేశాం. సర్జల్ క్యాంప్ ఎల్ఓసీకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముర్కిదే క్యాంపుపై దాడి చేశామని ఇక్కడ నుంచి ముంబై పేలుళ్ల దాడి జరిగింది.. కసబ్ ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడని రక్షణ శాఖ తెలిపింది.
ఆపరేషన్ సిందూర్ పై భారత విదేశాంగ శాఖ, రక్షణ శాఖ మీడియా సమావేశం
By admin1 Min Read