భారత్, పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న పరిస్థితులపై జీ7 కీలక సూచన చేసింది. అత్యంత సంయమనం పాటించాలని, తక్షణమే సైనిక ఘర్షణను తగ్గించుకుని చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఏడు దేశాల కూటమి (జీ7) పిలుపునిచ్చింది. న్యూక్లియర్ పవర్ కలిగిన ఈ రెండు పొరుగు దేశాల మధ్య సైనిక ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఈమేరకు కీలక ప్రకటన చేసింది. జరుగుతున్న పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, డిప్లామాటిక్ చర్చల ద్వారా శాశ్వత పరిష్కారానికి మా మద్దతు ఉంటుందని జీ7 దేశాలు స్పష్టం చేశాయి. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా విదేశాంగ మంత్రులతో పాటు యూరోపియన్ యూనియన్ ఉన్నత ప్రతినిధి ఈ మేరకు ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత్, పాకిస్థాన్‌లు అత్యంత సంయమనం పాటించాలని కోరుతున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు దేశాల పౌరుల క్షేమం,భద్రత గురించి తాము ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
Previous Articleపాక్ డ్రోన్స్ కూల్చివేత… వీడియో పోస్ట్ చేసిన భారత ఆర్మీ
Next Article పాక్ డ్రోన్ లాంచింగ్ ప్యాడ్ ను ధ్వంసం చేసిన భారత్