‘ఆపరేషన్ సిందూర్’ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడంలో భారత రాజకీయ, సామాజిక వ్యూహాత్మక సంకల్పానికి నిదర్శనమని రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు . ఉగ్రవాదులతో పాటు భారత వ్యతిరేక శక్తులపై మన సైన్యం ప్రతీకారం తీర్చుకుందని అన్నారు. మన సైన్యం పరాక్రమాన్ని చూపిందని పాకిస్థాన్ సైనిక హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండి లో కూడా గర్జించిందని స్పష్టం చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లో ‘బ్రహ్మోస్’ మిస్సైల్స్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఈ ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదంపై పోరులో భారత్ ధృఢ సంకల్పాన్ని మన సైనిక శక్తి సామర్థ్యాలను చాటి చెప్పిందని పేర్కొన్నారు. భారత్ పాక్ పౌరులపై దాడి చేయలేదని పాక్ మాత్రం సాధారణ పౌరులే లక్ష్యంగా దాడులు చేసిందన్నారు.
పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో కూడా ‘భారత సేన’ సత్తా చాటింది: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
By admin1 Min Read