దేశ రాజధాని ఢిల్లీలో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ అధికారులు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబసభ్యుల ఆవేదనను దేశం మొత్తం చూసింది. ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేశామని చెప్పారు. 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాం.. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ లాంటివారికి శిక్షణ ఇచ్చిన ప్రాంతాలపై దాడి చేశాం.. ఉగ్రవాదం అంతానికే ఆపరేషన్ సిందూర్ అని DGMO రాజీవ్ ఘాయ్ స్పష్టం చేశారు. ఉగ్రవాద శిబిరాలపై దాడిని వీడియో తీసి విడుదల చేశామని తెలిపారు. 9 ఉగ్రవాద శిబిరాల్లో వంద మందికిపైగా ఉగ్రవాదులు చనిపోయారు. పాకిస్తాన్ మాత్రం సామాన్యులు, ప్రార్థనా స్థలాలు, స్కూళ్లను టార్గెట్ చేసిందని డీజీఎంవో రాజీవ్ ఘాయ్ పేర్కొన్నారు. నిన్న పాక్ DGMO నాతో మాట్లాడి కాల్పుల విరమణకు ప్రతిపాదించారు. కాల్పుల విరమణ అంగీకారం కుదిరాక కూడా నిన్న రాత్రి పాక్ ఉల్లంఘనలకు పాల్పడింది. దానిపై పాక్ DGMOను వివరణ అడిగామని ఆయన తెలిపారు. మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.ఇవాళ కనుక పాక్ దాడులకు దిగితే.. వాటిని ఎదుర్కొనేందుకు ఫ్రీహ్యాండ్ ఇచ్చారని DGMO రాజీవ్ ఘాయ్ వెల్లడించారు.
ఎయిర్ మార్షల్ ఏకే భారతి:
టార్గెట్స్‌ను పక్కాగా ప్లాన్ చేసి అటాక్ చేశాం. బోర్డర్ కు దగ్గర మురిద్కేలో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరంపై మొదటి దాడి చేశాం. మురిద్కేలో 4 టార్గెట్స్‌పై కచ్చితత్వంతో దాడి చేశాం. డ్రోన్లు, ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను భారత భూభాగంపై పాక్ ప్రయోగించింది. 8,9 తేదీల్లో శ్రీనగర్ నుండి నలియా వరకు డ్రోన్లతో దాడి చేశారు. పాక్ డ్రోన్లు, UAVల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాం. ఉగ్రవాదులు, వారికి సంబంధించిన స్థలాలను మాత్రమే టార్గెట్ చేశాం.
నేవల్ డీజీ ప్రమోద్:
పాక్ నేవల్, ఎయిర్‌బేస్‌లపై గురిపెట్టాం.. ఉగ్రదాడులకు ప్రతిచర్యగానే భారత్ ప్రతిదాడి చేసింది.. గుంపులుగుంపులుగా డ్రోన్లను పాక్ భారత్‌పైకి పంపింది.. పాక్‌పై దాడి చేయడం తప్ప భారత్‌కు మరో మార్గం లేదు. పాక్‌లోని సైనిక స్థావరాలను పూర్తిగా నిర్వీర్వం చేశాం.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు