ఛత్తీస్ ఘడ్ అడవులు మరోసారి తుపాకులు కాల్పులతో దద్దరిల్లాయి. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏకంగా 27 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించాడు. మరికొందరు మావోలు గాయపడినట్టు సమాచారం. మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతాబలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు ఆపరేషన్ లో పాల్గొన్నాయి. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మరణించిన విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో నంబాళ్ల కేశవరావు ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఆయనపై రూ.1.5కోట్లు రివార్డు ఉన్నట్లు తెలిపారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

