నేడు కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం నాలుగు కుంకీ ఏనుగులను అందజేసింది. మొత్తం ఆరు కుంకీ ఏనుగులు ఇవ్వవలసి ఉండగా, రెండు ఏనుగులను వాటి ఆరోగ్య కారణాలు, శిక్షణ పూర్తి కాకపోవడం వంటి కారణాల వల్ల మరో దఫా అందజేయనున్నట్టు కర్ణాటక ప్రభుత్వం తెలియచేసింది.దేవా, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే పేర్లు కలిగిన కుంకీ ఏనుగులను అప్పగించారు.కర్ణాటకకు చెందిన మావటీలు రెండు నెలలపాటు కుంకీ ఏనుగులతో ఉండి ఆంధ్రప్రదేశ్ మావటీలకు వాటి సంరక్షణ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. కర్ణాటక విధాన సౌధ లో నేడు జరిగిన కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ కాండ్రే, ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రెండు వేరువేరు రాజకీయ కూటములకు చెందిన ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ పర్యావరణ అంశానికి సంబంధించి సహకరించేందుకు ముందుకు వచ్చినందుకు కర్ణాటక ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కుంకీ ఏనుగులను జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చారు. వాటి సంరక్షణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని పవన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని ఏనుగులు ఇవ్వడానికీ సిద్ధమని ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు