దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజధాని ఢిల్లీలో కొవిడ్ మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. వారం రోజుల్లో నగరంలో 100కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తంలో ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,009కి చేరినట్లు కేంద్ర కొవిడ్-19 సమాచార నివేదిక తెలిపింది. ఒక్క ఢిల్లీలోనే 104 యాక్టివ్ కేసులు ఉండగా, వీటిలో 99 కేసులు గత వారం రోజుల్లోనే నమోదైనట్లు తెలుస్తోంది.
రాష్ట్రాల వారీగా కేరళలో 430, మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104 మంది కొవిడ్ బాధితులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గుజరాత్‌లో 83, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్‌లో 15, పశ్చిమ బెంగాల్‌లో 12 చొప్పున యాక్టివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. కొవిడ్ కారణంగా మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మరణించినట్లు సమాచారం. ఇక దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఒక్క యాక్టివ్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
పెరుగుతున్న కోవిడ్ కేసులు… ఢిల్లీలో 100కు పైగా యాక్టివ్ కేసులు
By admin1 Min Read