ఉగ్రవాదుల దుశ్చర్యలకు భయపడేది లేదని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మరోసారి స్పష్టం చేశారు. టూరిజాన్ని ఘర్షణలతో ముడిపెట్టవద్దని, ఆయా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను అంచనా వేయడానికి టూరిజాన్ని కొలమానంగా చూడవద్దని అభ్యర్థించారు. ఉగ్ర చర్యలకు ప్రభుత్వం భయపడబోదని స్పష్టమైన సందేశం పంపడానికి తాజాగా ఆయన క్యాబినెట్ ప్రత్యేక సమావేశాన్ని పహల్గాంలోని క్లబ్ లో నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఏప్రిల్ 22న జరిగిన ఉగ్ర దాడులను ఖండించి బాధితుల పక్షాన నిలిచిన వారికి, ముఖ్యంగా పహల్గాం వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. వారికి వందనాలు చెబుతూ మీడియా సమావేశాన్ని ప్రారంభించారు. ఏప్రిల్ 22న ఉగ్ర దాడి తదనంతరం ‘ఆపరేషన్ సిందూర్’ తో భారత్ గట్టిగా బదులిచ్చిన విషయం తెలిసిందే.
పహాల్గాం లో జమ్మూకాశ్మీర్ కేబినెట్ భేటీ…ఉగ్ర చర్యలకు భయపడేదన్న సీఎం ఒమర్ అబ్దుల్లా
By admin1 Min Read