ఉగ్రవాదులకు నిలయమైన పాకిస్థాన్ పై భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి నిప్పులు చెరిగారు. ఉగ్రవాదం మే ఆ దేశ యుద్దనీతి అని దుయ్యబట్టారు. ఆ దేశం అనుసరిస్తున్న ఉగ్రవాదం పరోక్ష పోరు కిందనుంచి అది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న యుద్ధ వ్యూహామని పేర్కొన్నారు. ఆ వ్యూహాన్ని తిప్పి కొట్టేందుకు భారత్ గట్టిగా బదులిస్తుందని మరోసారి పునరుద్ఘాటించారు. వసుధైక కుటుంబం అన్న భావన మన భారతీయ సంస్కారమనో మన పొరుగువారి సంతోషాన్నీ మనం కోరుకుంటాం. మన బలాన్ని సవాలు చేస్తే మనదేశం వీరుల గడ్డ అని కూడా చూపిస్తామని మోడీ తెలిపారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం గాంధీనగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలను పాక్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించిందని మోడీ ఫైర్ అయ్యారు. ఉగ్రవాదుల శవపేటికలపై పాక్ జాతీయజెండా కప్పటంతోపాటు సైన్యం సెల్యూట్ చేసిందని పాక్ వైఖరిని ఎండగట్టారు.
పాక్ వ్యూహాన్ని భారత్ గట్టిగా తిప్పి కొడుతోంది: భారత ప్రధాని మోడీ
By admin1 Min Read