ఐపీఎల్ సీజన్ 18 లో మొదటి క్వాలిఫైయర్ లో సుదీర్ఘ కాలంగా ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న రెండు జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన బెంగళూరు ఫైనల్ చేరింది. ముల్లాన్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ పేలవ ప్రదర్శనతో ఢీలా పడింది. 14.1 లో 101 పరుగులకు ఆలౌటయింది. స్టోయినీస్ (26), ప్రభ్ సిమ్రాన్ (18), ఒమర్జాయ్ (18) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో సుయాష్ శర్మ 3 వికెట్లు, హేజల్ వుడ్ 3 వికెట్లు, యష్ దయాళ్ 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫిల్ సాల్ట్ 56నాటౌట్ (27; 6×4, 3×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. మయాంక్ అగర్వాల్ (19), రజత్ పటేదార్ (15 నాటౌట్) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో ఎం.ఖాన్, జేమిసన్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
ఫైనల్ లోకి దూసుకెళ్లిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు… క్వాలిఫైయర్ లో పంజాబ్ కింగ్స్ పై ఘనవిజయం
By admin1 Min Read