నేడు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అనంతవరంలోని ఏడీసీఎల్ పార్కులో వన మహోత్సవం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ పరిశీలించారు. ఇద్దరూ మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలు, చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పవన్ కళ్యాణ్ అన్నారు.వచ్చే ఏడాదికి అయిదు కోట్ల మొక్కలు నాటి పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు. నల్లమల కోసం మూడు దశాబ్దాలుగా పని చేస్తున్న అంకారావు జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అడవుల పెంపకమే కాదు… కార్చిచ్చుల నివారణకు సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పర్యావరణంపై అవగాహన కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గతంలో ఒక ప్రభుత్వం ఉండేది. ఆ ప్రభుత్వానికి చెట్లు నరకటం బాగా తెలుసు కానీ, చెట్లు పెట్టటం, పెంచటం తెలియదని విమర్శించారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రజలందరూ దీనికోసం తమ వంతు కృషి చేయాలన్నారు. 50 శాతం పచ్చదనం రాష్ట్రంలో ఉండాలని సూచించారు. 5 కోట్ల మొక్కలు నాటే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
Previous Articleఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు పలికిన ఆస్ట్రేలియా ఉపప్రధాని రిచర్డ్ మార్లెస్
Next Article వీర మహిళా బృందం ఇచ్చిన మొక్కను నాటిన ప్రధాని మోడీ