ప్రధాని నరేంద్ర మోడీ తన అధికారిక నివాసంలో ‘సింధూర’ మొక్కను నాటారు. నేడు పర్యావరణ దినోత్సవం సందర్భంగా 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్థాన్ తో భారత్ చేసిన యుద్ధంలో ధైర్య సాహసాలు చూపిన మహిళా బృందం ఇచ్చిన మొక్కను నాటారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్థాన్ తో భారత్ చేసిన యుద్ధంలో కల్కు చెందిన తల్లులు, సోదరీమణులు తమ వీర పరాక్రమాలను ప్రదర్శించారు. ఇటీవల నేను గుజరాత్ లో పర్యటించిన సమయంలో ఆ మహిళా బృందం నన్ను కలిసింది. అప్పుడే వారు నాకు ఈ మొక్కను అందించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ మొక్కను నాటాను. ప్రధానమంత్రి నివాసంలో ఈ మొక్కను నాటే గొప్ప అవకాశం నా దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నంగా నిలుస్తుందని ప్రధాని మోడీ పోస్టు చేశారు.
Previous Articleమొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
Next Article 24 గంటల వ్యవధిలో 564 కొత్త కరోనా కేసులు

