జూలై 3 నుండి దక్షిణ కాశ్మీర్ లోని హిమాలయ పర్వతాలలో పవిత్ర అమరనాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఆగష్టు 9న ముగుస్తుంది. గతంలో ఈ యాత్ర 52 రోజుల పాటు జరిగేది. అయితే దీనిని 38 రోజులకు కుదించారు. అధికారులు ఈ యాత్ర కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అమరనాథ్ యాత్రికులకు ఉగ్రముప్పును అరికట్టే చర్యల్లో భాగంగా జమ్మూకాశ్మీర్ పోలీసులు పహాల్గాం వెళ్లే మార్గంలో వెళ్లే యాత్రికుల కోసం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రతను కట్టుదిట్టం చేసే క్రమంలో ఉగ్రవాదులు, అనుమానిత ఉగ్రవాదుల ఫోటోలు ఆ సిస్టమ్ లో పొందుపరిచారు. ఆ నిఘా కెమెరాలకు బ్లాక్ లిస్టులో ఉన్న ఎవరైనా వ్యక్తి కనిపిస్తే అబ్జర్వేషన్ సెంటర్ లో ఉన్న సైరన్ లు గట్టిగా మోగుతాయి. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమై ముందుకు కదులుతాయి. గతంలో కూడా ఉగ్రవాదులు అమరనాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. దీంతో భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అమరనాథ్ యాత్రలో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్…భద్రతకు పటిష్టమైన ఏర్పాట్లు
By admin1 Min Read