గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్రూ సిబ్బంది ఉన్నారు. విమానం కూలిపోతున్న దృశ్యాన్ని ఒక స్థానిక వ్యక్తి తన ఫోన్ లో బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే, ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాద వివరాలు, సహాయక చర్యల పురోగతి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి రామ్మోహన్ నాయుడు కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.
క్షేత్రస్థాయిలో సహాయక, పునరావాస కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించేందుకు తాను తక్షణమే అహ్మదాబాద్‌కు బయలుదేరుతున్నట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధానికి తెలిపారు. దీనిపై స్పందించిన ప్రధానమంత్రి, ప్రమాద బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను వెంటనే అందించాలని మంత్రికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు