అమెరికా ఇరాన్ లోని మూడు కీలక అణు కేంద్రాలపై విజయవంతంగా దాడులు పూర్తి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. “ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్” అణు కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక “ట్రూత్ సోషల్”లో ఒక పోస్ట్ చేశారు. ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్‌లతో సహా మూడు అణు స్థావరాలపై మేం చేపట్టిన దాడి చాలా విజయవంతంగా పూర్తయింది. మా విమానాలు ఇప్పుడు ఇరాన్ గగనతలం నుంచి బయటకు వచ్చేశాయి. ప్రధాన స్థావరమైన ఫోర్డోపై పూర్తిస్థాయి బాంబుల పేలోడ్‌తో దాడి చేశాం. అన్ని విమానాలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు తిరుగు ప్రయాణమయ్యాయి. అమెరికన్ యోధులకు అభినందనలు. ప్రపంచంలో మరే ఇతర సైన్యం కూడా ఇలాంటి దాడి చేయలేదు. ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైంది! ఈ విషయానికి మీరు ప్రాధాన్యత ఇచ్చినందుకు ధన్యవాదాలని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.
Previous Articleఇరాన్ నుండి కొనసాగుతున్న భారతీయుల తరలింపు: కేంద్ర విదేశాంగ శాఖ
Next Article ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది ఈ ఘటన: ఏపీసీసీ చీఫ్ షర్మిల