ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్, గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్య భాష విభాగం స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిధిగా హాజరయ్యారు. హిందీ భాష ఆవశ్యకతపై ఆయన ప్రసంగించారు.మనం హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోయినట్టు కాదు, మనం మరింటి బలపడటం.ఇంకొక భాషని అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణం చెయ్యడం.ఇంగ్లీష్ నేర్చుకోవడం వలనే కదా ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద ఎక్కువ శాతం జనాభా మాట్లాడే హిందీ భాష నేర్చుకోవడం వల్ల ప్రయోజనమే కానీ నష్టం వచ్చే పరిస్థితి ఏం లేదని పవన్ అన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, దేశంలోని ఇతరత్రా అన్ని భాషలు కావొచ్చు మన మాతృ భాష మీద మనకి గౌరవం ఉంటుంది, మన మాతృ భాష అమ్మైతే మన పెద్దమ్మ భాష హిందీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఉప సభాపతి హారివన్ష్, తెలంగాణకు చెందిన హిందీ విద్యావేత్త శ్రీమతి మాణిక్యాంబ, తమిళనాడుకు చెందిన హిందీ విద్యావేత్త శ్రీ అనంతకృష్ణన్ గారు తదితరులు పాల్గొన్నారు.
ఇంకొక భాషని అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్
By admin1 Min Read