భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. బీజింగ్ లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ తో సమావేశమై రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతపై చర్చించారు. షాంఘై సహకార సంస్థ (SCO) అధ్యక్ష పదవికి చైనాకు భారత మద్దతును ఈసందర్భంగా తెలియజేశారు. మీడియాతో మాట్లాడుతూ బీజింగ్ ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ ను కలవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. కైలాస మానససరోవర్ యాత్రను పునఃప్రారంభించినందుకు భారత ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఐదేళ్ల అనంతరం అటానమస్ రీజియన్ షిజాంగ్ (టిబెట్)లో ఉన్న మాపవ్ యున్ సో (మానససరోవర్ సరస్సు)కు భారత యాత్రికులు చేరుకోవడంపై హార్షం వ్యక్తంచేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు సంక్లిష్టంగా మారాయని జైశంకర్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థికవ్యవస్థలు, పొరుగు దేశాలుగా భారత్-చైనా మధ్య అభిప్రాయాలు, దృక్పథాలపై చర్చలు అవసరమని పేర్కొన్నారు. ఇటీవల కజాన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ లో భేటీ తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతున్నాయన్నారు.
చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ తో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ భేటీ
By admin1 Min Read
Previous Articleస్పేస్ పాలసీని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Next Article అరకును కాఫీ బ్రాండ్ గా తీర్చిదిద్దాం:హోం మంత్రి అనిత