అమెరికాలోని అలాస్కా తీరంలో తాజాగా 7.3 తీవ్రతతో భూకంపం చోటు చేసుకుంది. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:37 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని కేంద్రం సాండ్ పాయింట్ కు దక్షిణంగా 87 కిలోమీటర్ల దూరంలో ఉందని యూఎస్‌జీఎస్ తెలిపింది. భూకంప కేంద్రం 20.1 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు పేర్కొంది. ఈ భూకంపం తర్వాత దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పానికి అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సునామీ సంభవించే అవకాశం ఉందని అలాస్కాలోని పామర్‌లోని జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది.
Previous Article150కిపైగా దేశాలపై 10 లేదా 15 శాతం టారిఫ్ లు
Next Article భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రకు బ్రేక్