రూ.2కే వైద్యం చేసి ఎందరికో సాయం చేసిన ప్రముఖ డాక్టర్ ఎ.కె.రాయరు గోపాల్ (80) శనివారం కన్నుమూశారు. కేరళలోని కన్నూర్ లో 5 దశాబ్దాలపాటు వేల మంది రోగులకు తన సేవలందించి చిరస్మరణీయ వ్యక్తిగా నిలిచారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం అంత్యక్రియలు జరిగాయి. గోపాల్ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అందరూ ఆయనను 2 రూపాయల వైద్యుడని పిలిచేవారు. మెడిసిన్స్ కూడా కొనలేని వారికి గోపాలే స్వయంగా మందులు అందించేవారు.
Previous Articleపలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు… నదుల్లో పెరిగిన నీటి ప్రవాహం
Next Article జార్ఖండ్ దిగ్గజ నేత, మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత