కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ‘అనర్హత’ బిల్లుల విషయంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్ర ప్రభుత్వానికి సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ సహా విపక్షాలు వ్యతిరేకిస్తున్న వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర, రాష్ట్రాల్లోని ప్రధానమంత్రి, సీఎంలు, మంత్రులు ఎవరైనా వరుసగా 30 రోజుల పాటు కస్టడీలో ఉంటే వారి పదవిని రద్దు చేసే నిబంధన ఈ బిల్లుల సారాంశం. లోక్‌సభ వాయిదా పడిన తర్వాత ఆయన మాట్లాడుతూ, 30 రోజుల పాటు జైలులో ఉన్న వ్యక్తి మంత్రిగా ఎలా కొనసాగుతారు? ఇది చాలా సాధారణమైన విషయం. ఇందులో నాకు పెద్దగా తప్పేమీ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఎవరైనా తప్పు చేస్తే మంత్రి పదవిలో ఉండకూడదన్నది చాలా సరైన విషయమని ఆయన పేర్కొన్నారు. అయితే ఇంకా బిల్లును తాను పూర్తిగా చదవలేదని, తన ఈ అభిప్రాయమే చివరిది కాదని ఈమేరకు స్పష్టం చేశారు. ఈ బిల్లుపై ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు, దానిపై లోతుగా చర్చ జరిపేందుకు దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని థరూర్ సూచించారు. దీనిని సెలక్ట్ కమిటీకి పంపిస్తామని అధికార వర్గాలు తెలపడం పై కూడా శశిథరూర్ స్పందించారు. ఇది ఎంతో మంచి విషయమని అన్నారు. మన ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు