జమ్మూ- కాశ్మీర్ కుల్గామ్ జిల్లాలో నిన్న రాత్రి ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.వారిద్దరినీ విచారిస్తున్నారని సమాచారం.ఈ మేరకు దిగువ ముండాలోని గులాబ్ బాగ్ ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానంగా అటుగా వెళ్తుండటంతో…అనుమానం వచ్చి వారిని ఆగమని భద్రతా బలగాలు చెప్పారు.
అయితే ఆ ఇద్దరు ఉగ్రవాదులు పారిపోయే ప్రయత్నం చేశారు.దీనితో భద్రతా బలగాలు వెంటనే వారిని పట్టుకుని విచారించారు.విచారణలో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులని తేలింది.వారి నుండి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.అయితే వీరు ఏదైనా నేరం చేయబోతున్నారా అనే విషయంపై విచారణలో పోలీసులు ఆరా తీస్తున్నారు.