ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు & రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ )కి మరోసారి ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు దక్కింది.2024 సంవత్సరం గాను జాతీయ స్థాయి అవార్డు స్కోచ్‌కు ఏపీఎస్-ఆర్టీసీ ఎంపిక అయినట్లు సంస్థ ఈడీ ప్రకటించారు.తమ సంస్థకు అవార్డు రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కాగా యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్ల జారీ,డిజిటల్ టికెట్లు జారీ చేయడం, సంస్థ అన్ని బస్సుల్లో ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఆర్టీసి ఈ అవార్డుకు ఎంపికైనట్లు వెల్లడించారు.ఈ మేరకు నిన్న ఢిల్లీలో జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తరపున సంస్థ చీఫ్ ఇంజనీర్ (ఐటీ) వై. శ్రీనివాసరావు అవార్డును అందుకున్నారు.ఇంతకుముందు ఒకసారి ఏపీఎస్ ఆర్టీసీ ఈ స్కోచ్ అవార్డును కైవశం చేసుకుంది.