బెయిల్ పై బయటకు వచ్చిన మర్నాడే డీఎంకే నేత సెంథిల్ బాలాజీ మంత్రిగా పదవి అందుకోవడం పై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.అసలు అక్కడ ఏం జరుగుతుంది అని ప్రశ్నించింది.”బెయిల్ మంజూరు విషయంలో మేము సరైన నిర్ణయమే తీసుకున్నాం.అతడి బెయిల్ రద్దు చేయడం గురించి విచారణ జరిపేది లేదు.కానీ,సాక్షులు ప్రభావితం అవుతారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం.దీనిపై విచారణ జరుపుతాం” అని సుప్రీం స్పష్టం చేసింది.మనీ లాండరింగ్ కేసు లో సెంథిల్ బాలాజీ గతంలో అరెస్టు అయ్యారు.
బెయిల్ పై బయటకి వచ్చిన ఆయన ఆ మరుసటి రోజే మంత్రిగా పదవి స్వీకరించారు.మంత్రి పదవి వల్ల సాక్షులపై ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని..బెయిల్ మంజూరు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పిటిషన్‌లో కోరుతూ సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు అయింది.దీనిపై కోర్టు విచారించింది.బెయిల్ పొందిన వెంటనే వి.సెంథిల్ బాలాజీకి తమిళనాడు ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.సాక్షులపై కొంత ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.