భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు పెళ్లి పీటలెక్కనున్నారు. త్వరలో ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు.పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయితో ఈ నెల 22న ఆమె పెళ్లి జరగనుంది.రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరగనున్నఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలతోపాటు అత్యంత సన్నహితులు,పలువురు క్రీడాకారులు పాల్గొననున్నారు.ఈపెళ్లి గురించి సింధు తండ్రి మీడియాతో మాట్లాడారు.మా కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. గత నెలలోనే పెళ్లి గురించి మాట్లాడుకున్నాం. ఇటీవల డేట్ ఫైనల్ చేసుకున్నాం.జనవరిలో సింధుకు వరుస టోర్నీలు ఉన్నాయి.అందుకే డిసెంబర్‌లోనే పెళ్లి చేయాలని నిర్ణయించాం.ఈ నెల 24న హైదరాబాద్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ ఉంటుంది.ప్రముఖులు హాజరవుతారని తెలిపారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

