అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జాతీయ దివ్యాంగ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ తమలో దాగి ఉన్న శక్తిసామర్ధ్యాలను గుర్తిస్తే ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకోవచ్చని పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులు వారి స్వశక్తిపై ఆధారపడి జీవించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని రాష్ట్రపతి అన్నారు. ఈ సంవత్సరం పదుల సంఖ్యలో పారా ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. వ్యాపార, వాణిజ్యం ఇలా వివిధ రంగాలలో కూడా దివ్యాంగులు నేడు మిగిలినవారితో పోటీగా రాణిస్తున్నారన్నారని రాష్ట్రపతి పేర్కొన్నారు. పనిచేసే అవకాశాలు అందించబడితే, ఇతర వ్యక్తుల మాదిరిగానే, దివ్యాంగులలో కూడా ఆత్మవిశ్వాసం మరియు సార్థకమైన జీవితం గడిపే భావన వెలుగులోకి వస్తుందని తెలిపారు.
Previous Articleమే18న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
Next Article ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాతే ఎక్కువ వేతనాలు