వెస్ట్ బెంగాల్ సమీపంలోని సరిహద్దుల్లో టర్కీ తయారీ డ్రోన్లను బంగ్లాదేశ్ మోహరించిందన్న సమాచారంతో భారత్ అలర్ట్ అయ్యింది.ఈ మేరకు సరిహద్దుల వద్ద నిఘాను పెంచింది.బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఇవ్వడంతో ఈ పరిణామం చోటుచేసుకుందని తెలుస్తోంది.
భారత సరిహద్దు సమీపంలో టర్కీ తయారీ‘బైరాక్టర్ టీబీ2 మానవరహిత వైమానిక వాహనాలను మోహరించినట్టు వచ్చిన నివేదికలను ఆర్మీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.నిఘా కార్యకలాపాల కోసం బంగ్లాదేశ్‌లోని 67వ ఆర్మీ వీటిని నిర్వహిస్తున్నట్లు తెలిసింది.బంగ్లాదేశ్ రక్షణ అవసరాల కోసం వీటిని మోహరించినప్పటికీ,అధునాతన డ్రోన్లను సున్నిత ప్రాంతాల్లో ఉంచడంతో భారత్ అలెర్ట్ అయ్యింది.