సిరియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. సిరియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ అక్కడి మన పౌరులను తక్షణమే దేశం వీడాలని అడ్వైజరీ జారీ చేసింది.
సిరియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు భారతీయ పౌరులు సిరియా ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ప్రస్తుతం సిరియాలో ఉన్న భారతీయులు డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయంతో వారి అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ +963 993385973 (వాట్సాప్‌లో కూడా) మరియు అప్‌డేట్‌ల కోసం ఇమెయిల్ ID hoc.damascus@mea.gov.inలో టచ్ లో ఉండాలని తెలిపారు. వీలైన వారు, అందుబాటులో ఉన్న కమర్షియల్ ఫ్లైట్‌ల ద్వారా బయలుదేరాలని సూచించారు. మరియు ఇతరులు తమ భద్రత గురించి జాగ్రత్తలు తీసుకోవాలని మరియు వారి కదలికలను కనిష్ట స్థాయికి పరిమితం చేయాలని సూచించారు.
సిరియా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశాన్ని వీడాలని భారత పౌరులకు అడ్వైజరీ జారీ
By admin1 Min Read