తనకు కేటాయించిన సీటు వద్ద నగదు లభ్యమైందంటూ రాజ్యసభ చైర్మన్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ స్పందించారు.రాజ్యసభకు వెళ్లేటప్పుడు ఒక రూ.500 నోటు తీసుకెళ్తుంటానని ఆయన చెప్పారు.నిన్న మధ్యాహ్నం 12.57 గంటల సమయంలో నేను పార్లమెంట్‌కు చేరుకున్నాను.మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సభలో ఆందోళన జరుగుతోంది.ఆ సమయంలో నేను క్యాంటీన్‌కు వెళ్లి 1.30 గంటల వరకు అక్కడే ఉన్నాను.అయోధ్య ప్రసాద్‌తో కలిసి క్యాంటీన్లో ఉన్నానని చెప్పారు.ఆ తర్వాత పార్లమెంట్ నుండి వెళ్లిపోయాను.కానీ మీరు నా పేరు ప్రస్తావించారని అభిషేక్ మను సింఘ్వీ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.కాగా ఆయన తెలంగాణ రాష్ట్రం నుండి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే.
నేను సభకు వెళ్ళేప్పుడు 500 నోటు మాత్రమే తీసుకు వెళ్తా:- కాంగ్రెస్ అభిషేక్ సింఘ్వీ
By admin1 Min Read