పశ్చిమాసియా దేశమైన సిరియా తిరుగుబాటు దారుల చేతిలోకి వెళ్లింది. ఐదున్నర దశాబ్దాల కుటుంబ పాలనకు ఆదేశ ప్రజలు ముగింపు పలికారు. తిరుగుబాటు దారులు సిరియా రాజధాని డమాస్కస్ లో ప్రవేశించడంతో అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశాన్ని వీడారు. దీంతో పూర్తిగా తిరుగుబాటు దారుల చేతిలోకి వెళ్లింది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. నిరంకుశ పాలన పోయిందని హార్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు బషర్-అల్-అసద్ కుటుంబంతో పాటు సిరియా వదిలి రష్యాకు శరణార్థిగా వెళ్లిపోయారు. డమాస్కస్ లోని అధ్యక్ష భవనం లూటీకి గురైంది. పలువురు భవనం లోకి చొరబడి చేతికందినవి పట్టుకు పోయారు. పోలీసులు, సైనికులు తమ స్థావరాలను విడిచి వెళ్లారు. గత కొన్నేళ్లలో లెబనాన్ కు వలస వెళ్ళిన అనేకమంది సిరియన్లు తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో సిరియా ప్రధాని మహామ్మద్ ఘాజీ జలాలీ స్పందిస్తూ ప్రతిపక్షాలకు అధికార బదిలీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని తిరుగుబాటు దారులకు విజ్ఞప్తి చేశారు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో రష్యా, ఇరాన్ స్పందించాయి. తిరుగుబాటు దారులతో అధికార బదిలీపై చర్చల తర్వాతే అధ్యక్షుడు బషర్-అల్-అసద్ సిరియా వీడినట్లు రష్యా తెలిపింది. ఇకపై విదేశీ జోక్యం లేకుండా సిరియన్లే తమ దేశ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని ఇరాన్ సూచించింది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

