సిరియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉంటున్న భారత పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 75 మంది భారతీయులను సిరియా రాజధాని డమాస్కస్ నుండి లెబనాన్ కు తరలించారు. భారతీయ పౌరులు సురక్షితంగా లెబనాన్ చేరుకున్నారని, కమర్షియల్ ఫ్లైట్స్ ద్వారా స్వదేశానికి తిరిగి వస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
సిరియాలోని భారతీయ పౌరుల అభ్యర్థనలు, అక్కడి భద్రతా పరిస్థితిని అంచనా వేసిన తరువాత మన పౌరులను తీసుకొని రావడానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంది. డమాస్కస్, బీరట్ లోని భారత రాయబార కార్యాలయాలు దీనికి సహకరించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇక తాజాగా తరలించిన 75 మందిలో జమ్మూ కశ్మీర్ చెందిన 44 మంది యాత్రికులు ఉన్నారు. వారు సైదా జైనాబ్ వద్ద చిక్కుకుపోయారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
విదేశాలలో ఉన్న భారతీయ పౌరుల భద్రతకు భారత ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపింది. సిరియాలో మిగిలి ఉన్న భారతీయ పౌరులు డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయానికి వారి అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ +963 993385973 (వాట్సాప్) మరియు అప్‌డేట్‌ల కోసం ఇమెయిల్ ID (hoc.damascus@mea.gov.in)తో టచ్ లో ఉండాలని సూచించారు. ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూనే ఉంటుందని పేర్కొంది.
ఇక ఐదున్నర దశాబ్దాల కుటుంబ పాలనకు ఆదేశ ప్రజలు ముగింపు పలికారు. తిరుగుబాటు దారులు సిరియా రాజధాని డమాస్కస్ లో ప్రవేశించడంతో అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశాన్ని వీడారు. దీంతో పూర్తిగా తిరుగుబాటు దారుల చేతిలోకి వెళ్లింది. బషర్-అల్-అసద్ కుటుంబంతో పాటు సిరియా వదిలి రష్యాకు శరణార్థిగా వెళ్లిపోయారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు