నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దల్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దల్ కు జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేశారు. సైనిక ఖడ్గం మరియు బిరుదు పత్రం, ఇండియన్ ఆర్మీ క్యాప్ తో సత్కరించారు. భారత్-నేపాల్ దేశాల మధ్య ఉన్న సైనిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే విధంగా భారత్ లో ఆయన పర్యటిస్తున్నారు. పలువురు అధికారులతో చర్చలు జరిపారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కూడా సమావేశమయ్యారు. రక్షణ పరమైన అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ గౌరవ పురస్కారాన్ని అందుకున్న ఆయనకు రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు.
నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దల్ కు జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ గౌరవ పురస్కారం
By admin1 Min Read
Previous ArticleiGoT కర్మయోగి భారత్ పోర్టల్‌లో 7 లక్షలకు పైగా ఉద్యోగులను నమోదు చేసి ఏపీ ప్రభుత్వం రికార్డు
Next Article క్లింకార ఫోటో షేర్ చేసిన ఉపాసన…!