భారత రాజ్యాంగాన్ని ఉద్దేశించి పార్లమెంట్ లో ప్రత్యేక చర్చ జరిగింది.రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్ల అయిన సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఈ చర్చను ఆరంభించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు.కుటుంబం కోసం రాజ్యాంగాన్నే మార్చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతం అని అన్నారు.”రెండో ప్రపంచయుద్ధం తర్వాత దాదాపు 50 దేశాలకు స్వాతంత్ర్యం లభించింది.అవి రాజ్యాంగాన్ని రాసుకున్నాయి.కాలక్రమంలో పలు దేశాలు తమ రాజ్యాంగం అసలు ఉద్దేశాన్ని మార్చివేశాయి.కానీ మన రాజ్యాంగం మాత్రం ఎన్ని పరీక్షలకు ఎదుర్కొని నిలబడింది.వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేసేందుకు కాంగ్రెస్ సవరణలు చేసింది.ఇప్పుడు మాత్రం రాజ్యాంగ పరిరక్షణ గురించి ప్రసంగాలు ఇస్తుంది ‘ అని నిర్మలమ్మ దుయ్యబట్టారు.
Previous Articleబంగ్లాదేశ్ దాడులపై పార్లమెంట్ లో ప్రియాంక వాద్రా
Next Article ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల