హిందువులు ఇతర మైనారిటీలపై ఇటీవల బంగ్లాదేశ్, పాకిస్థాన్ లో జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో షేక్ హాసీనా ప్రభుత్వం కూలిపోవడం ఆమె దేశం విడిచి వెళ్లడం తదనంతర పరిణామాలతో అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు సంబంధించి ఈ ఒక్క సంవత్సరంలోనే 2200 కేసులు నమోదైనట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు పాకిస్థాన్ లో కూడా 112 కేసులు నమోదైనట్లు రాజ్యసభకు తెలిపింది. ఈ రెండు దేశాలలో తప్ప మరే పొరుగు దేశంలో హిందువులపై హింసాత్మక దాడులు నమోదవలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఈ దాడులను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత కల్పించేందుకు బంగ్లాదేశ్ తగిన చర్యలన్నీ తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. దౌత్యమార్గాల ద్వారా ఆయా ప్రభుత్వాలతో తమ ఆందోళన తెలిపినట్లు వెల్లడించింది.
పాకిస్థాన్ కు కూడా మతపరమైన హింస, మైనారిటీ వర్గాలపై హింసాత్మక ఘటనలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు భారత విదేశాంగ వెల్లడించింది. అంతర్జాతీయ వేదికలపై కూడా పాకిస్థాన్ వైఖరిని ఎండగడుతూనే ఉన్నామని తెలిపింది.
హిందువులపై హింసాత్మక ఘటనలకు సంబంధించి బంగ్లాదేశ్ లో 2022లో 47, 2023లో 302కేసులు నమోదు కాగా… ఈ ఏడాది డిసెంబర్ 8నాటికి ఏకంగా 2200 కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్ లో 2022లో 241 కేసులు, 2023లో 103, 2024లో 112 ఘటనలు జరిగినట్లు విదేశాంగ నివేదిక ప్రకారం తెలుస్తోంది.
బంగ్లాదేశ్ లో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు:ఈ సంవత్సరంలోనే 2200 ఘటనలు
By admin1 Min Read
Previous Articleవారాన్ని నష్టాలతో ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Next Article కేటీఆర్ కు ఊరట…!