శీతాకాల విడిది కోసం హైదరాబాద్ విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది అనంతరం నేడు తిరిగి ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 17న విచ్చేసిన రాష్ట్రపతి రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. గత రాత్రి బొల్లారం అధికార నివాసంలో రాష్ట్రంలోని ప్రముఖులకు తేనేటీ విందు ఇచ్చారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీఎం రేవంత్ రెడ్డి, సహచర మంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మిలిటరీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నేడు హకీంపేట్ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి తిరుగు ప్రయాణం అయ్యారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మహిళాభివృధ్హి శాఖామంత్రి సీతక్క రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు.
శీతాకాల విడిది: పర్యటన పూర్తి చేసుకుని ఢిల్లీ వెళ్లిన రాష్ట్రపతి
By admin1 Min Read
Previous Articleఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా మధుమూర్తి
Next Article ధ్యానం ఒక శక్తివంతమైన మార్గం