ఈశాన్య ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్దికి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు కేంద్ర హాం మంత్రి అమిత్ షా అన్నారు. త్రిపుర పర్యటనలో భాగంగా అగర్తలాలో జరిగిన ఈశాన్య మండలి 72వ ప్లీనరీలో హోంమంత్రి పాల్గొన్నారు. 8 రాష్ట్రాల సీఎంలు, గవర్నర్ లు హాజరయ్యారు. ప్రధాని మోడీ పాలనలో దేశంలో ఉగ్రదాడులు తగ్గాయని, ఈశాన్య రాష్ట్రాలలో 10,574 మంది సాయుధ మిలిటెంట్లు లొంగిపోయారని అమిత్ షా అన్నారు. 20 శాంతి ఒప్పందాలతో శాంతి నెలకొల్పారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రాలలో రైళ్ల కనెక్టివిటీ కోసం రూ.81,000 కోట్లు. రోడ్ల నిర్మాణం కోసం రూ.41,000 కోట్లు కేంద్రం ఖర్చు చేసిందని తెలిపారు. నేషనల్ ఆర్గానిక్ కార్పోరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
శాంతి నెలకొల్పాం:ఈశాన్య మండలి 72వ ప్లీనరీలో పాల్గొన్న హోంమంత్రి అమిత్ షా
By admin1 Min Read

