భారత్ కూడా అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలంటే దేశంలోని యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాలంటూ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇటీవల చెప్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చ కొనసాగుతూనే ఉంది. కొంతమంది ఆయన వ్యాఖ్యలను సమర్ధిస్తుంటే కొంత మంది వ్యతిరేకిస్తున్నారు.
తాజాగా ఆయన అభిప్రాయాన్ని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం విభేదించారు. సుదీర్ఘంగా పని చేయాలని చెప్పడం అర్థరహితమని అన్నారు. దానికంటే సమర్థతపై దృష్టిపెట్టాలని పేర్కొన్నారు.
అసమర్థమైన, నాసిరకం మౌలిక సదుపాయాలు, సౌకర్యాలతో మన రోజువారీ జీవితం ఒక పోరాటంలా సాగుతోందన్నారు. మంచి సామాజిక, సామరస్య పరిస్థితుల కోసం పని జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడమనేది చాలా ముఖ్యమని అన్నారు. వాస్తవానికి మనం వారానికి 4 రోజుల పని విధానానికి మారాలని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల కల్లా పని ముగించేలా ఉండాలని కాంగ్రెస్ ఎంపీ చిదంబరం పేర్కొన్నారు.
సుదీర్ఘంగా పని చేయడం అర్థరహితం: 4 రోజుల పని విధానానికి మారాలి: కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం
By admin1 Min Read