యువతకు తమ ప్రభుత్వం భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు ప్రధాని మోడీ అన్నారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని తెలిపారు. ప్రభుత్వం వారిలోని సామర్ధ్యాలను వినియోగించుకొని మరింత ముందుకువెళ్తుందన్నారు.
దేశ చరిత్రలో ఇదొక గొప్ప రికార్డని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నిజాయతీ, పారదర్శకతకు ప్రాధాన్యత నిస్తున్ననట్లు తెలిపారు. నేడు జరుగుతున్న రోజార్ మేళాలోనూ 71,000 మందికి పైగా యువతకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినట్లు వివరించారు. ఈవిధంగా ఉద్యోగాలు పొందినవారంతా అంకితభావంతో, నిజాయతీతో దేశం కోసం పని చేస్తున్నారని ఇదే విధంగా ముందుకుసాగితే 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు. దేశాభివృద్ధి యువత పైనే ఆధారపడి ఉందని కానీ గత ప్రభుత్వాలు వారికి సరైన ఉపాధి కల్పించలేకపోవడంతో దేశం వెనకబడిపోయిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని దానికి అనుగుణంగా మేక్ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలను తీసుకువచ్చామన్నారు. ప్రస్తుతం భారత్ అన్నిరంగాల్లో దూసుకుపోతుందన్నారు. స్పేస్, డిఫెన్స్, మొబైల్ మ్యానుఫాక్చరింగ్, రెన్యుబుల్ ఎనర్జీ, టూరిజం వంటి రంగాల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని పేర్కొన్నారు.
నేడు రోజ్ గార్ మేళాలో అందించిన నియామక పత్రాల్లో అధిక సంఖ్యలో యువతులు ఉన్నారని ప్రధాని మోడీ తెలిపారు. మహిళలు అన్నిరంగాల్లో సాధికారత సాధించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. అన్ని ప్రాంతాల యువతకు అనుకూలంగా ఉండేందుకు 13 భారతీయ భాషల్లో రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు.
దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం:యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన: ప్రధాని మోడీ
By admin1 Min Read