ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) 2025ను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంవత్సరంగా ప్రకటించింది. ప్రతి రంగంలోనూ ఏఐ కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో భవిష్యత్తు అంతా ఏఐ మీదనే ఆధారపడి నడుస్తుందనే సాంకేతిక నిపుణుల అంచనాల నేపథ్యంలో భారత్ ను కృత్రిమ మేధలో విశ్వగురువుగా మార్చాలన్న లక్ష్యంతో ఏఐసీటీఈ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, పాలిటెక్నిక్ తదితర కోర్సుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉంచి, విద్యార్థులను ఆ రంగంలో నిపుణులుగా మార్చాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగా పలు చర్యలు తీసుకోవాలని ప్రణాళిక రూపొందించింది.
ఈ నెలాఖరు నాటికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అమలు ప్రణాళికను సమర్పించాలని దేశవ్యాప్తంగా తన పరిధిలోని దాదాపు 14 వేల విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ కి, డైరెక్టర్లకు ఏఐసీటీఈ లేఖ రాసింది.
వచ్చే విద్యా సంవత్సరానికి అనుమతులు ఇచ్చే సమయంలో ఆయా కళాశాలలు సమర్పించిన ప్రణాళికలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఏఐ లో ఉత్తమ పనితీరు కనబరిచే కళాశాలలకు పురస్కారాలు ప్రకటించనుంది.
అందరికీ ఏఐ పేరిట విద్యా ప్రాంగణాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు పలు రకాల కార్యక్రమాలను ఏఐసీటీఈ సూచించింది. అవగాహన వారోత్సవాలు, వర్క్ షాప్ లు, నిపుణుల ప్రసంగాలు, హ్యాకథాన్లు నిర్వహణ వంటివి ఉన్నాయి.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

