ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. తద్వారా 2,63,411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఎస్.ఐ.పీ.బీ సమావేశం జరిగింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. వాటిపై ఎస్.ఐ.పీ.బీ సమావేశంలో చర్చించారు. ఇక దరఖాస్తు చేసుకున్న 9 సంస్థలకు ఏపీ సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. బీపీసీఎల్, టీసీఎస్, ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ వంటి తదితర ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. రానున్న ప్రాజెక్టుల గురించి అధికారులు సీఎంకు వివరించారు. 2028 నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఈసందర్భంగా అధికారులను ఆదేశించారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

