అధికారంలోకి రాగానే ఒక ప్లాన్ ప్రకారం “ఆరోగ్య శ్రీ’’ని నిర్వీర్యంచేసిన మాట వాస్తవం కాదా? అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు.ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.వైద్యం ఖర్చు రూ.25 లక్షలు అయినా సరే ప్రజలకు ఉచితంగా అందించేలా మా ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన ఈ పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? పేదల సంజీవనికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారు? ఏ స్వార్థ ప్రయోజనాలు ఆశించి దీన్ని దెబ్బకొడుతున్నారు? కోటిన్నర కుటుంబాల ఆరోగ్య బాధ్యతను ఇక ఎవరు తీసుకుంటారు? అని జగన్ ప్రశ్నించారు.నెట్‌వర్క్ హాస్పిటల్స్ కు ఇవ్వాల్సిన డబ్బులు నిలిపేసి, దాదాపు రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టారని ఆక్షేపించారు . ఆరోగ్యశ్రీ సేవలను కూడా ప్రైవేటుకు అప్పగించడం నిజం కాదా? అని పేర్కొన్నారు. ప్రైవేటు బీమా కంపెనీలు వేసే కొర్రీలతో పాలసీదారులు పడుతున్న అవస్తలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదా చంద్రబాబుగారు. మరి ఆరోగ్యశ్రీని వారికి అప్పగిస్తే.. వారు వేసే కొర్రీలతో జనం ఇబ్బంది పడరా? లాభార్జనే వారి ధ్యేయం అయినప్పుడు ప్రజాప్రయోజనాలు ఎంతవరకు సాధ్యం? కోవిడ్‌వంటి కొత్త రోగాలతో, అరుదైన వ్యాధులతో, ప్రమాదాల సమయంలో ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని వాడుకుని బాధితులకు ఆరోగ్యశ్రీని అందించి ఎంతోమందిని కాపాడుకుంది. ప్రొసీజర్ల జాబితా వ్యాధుల సంఖ్యను పెంచి మానవతా దృక్పథంతో స్పందించి ప్రభుత్వం అనేక మార్లు ఆదుకుందని వివరించారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ అని ఎన్నికల్లో మీరు ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలను ఎగరగొడుతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ఇచ్చిన పథకాలనూ రద్దుచేస్తున్నారని ఇప్పుడు కోటిన్నర కుటుంబాల ఆరోగ్యానికి ష్యూరిటీ లేదు కదా, ఉన్న గ్యారంటీని తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు నష్టంచేసే మీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే ఆరోగ్యశ్రీని యథాతథంగా ఉంచి అమలు చేయాలని జగన్ డిమాండ్ చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు