దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ట్రేడింగ్ ను ఫ్లాట్ గా ముగించాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలతో నష్టాల్లోకి వెళ్లిన మార్కెట్లు అనంతరం కొద్దిగా పుంజుకుని ఫ్లాట్ గా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 50 పాయింట్ల నష్టపోయి 78,148 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 23,688 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.88గా కొనసాగుతోంది. ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకి, హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో పయనించాయి.
Previous Articleఆరోగ్యశ్రీని యథాతథంగా ఉంచి అమలు చేయాలి:మాజీ సీఎం జగన్
Next Article అత్యాచార ఘటనపై స్పందించిన సీఎం స్టాలిన్